News April 8, 2025
వరంగల్: దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

వరంగల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నియమావళి రూల్స్ 2011 అమలు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు. వయో వృద్ధులు, వికలాంగులకు సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 17, 2025
నర్సంపేట: రాజకీయ భీష్ముడిగా పేరు.. ఈయన గురించి మీకు తెలుసా?

నర్సంపేటలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా మద్ధికాయల ఓంకార్‌కు గుర్తింపు ఉంది. 1972 నుంచి 1989 వరకు వరుసగా 5 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి MLAగా (MCPI(U))గెలిచి రికార్డు సృష్టించారు. రాజకీయ భీష్మునిగా పేరు ఉన్న ఈయన.. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. 1924లో జన్మించిన ఆయన 17 OCT 2008లో మరణించారు.
News April 17, 2025
ఎంజీఎంలో దొంగలు ఉన్నారు.. జాగ్రత్త!

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటూ ఆవరణలో మట్టెవాడ పోలీసులు బుధవారం బ్యానర్ కట్టారు. ఈ మేరకు ఆసుపత్రికి వచ్చే వారికి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఆసుపత్రిలో గుర్తు తెలియని దొంగలు తిరుగుతున్నారని, వాహనాలు, సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
News April 17, 2025
వరంగల్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

వరంగల్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారని అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.