News October 23, 2025
వరంగల్: ధాన్యం బకాయిలపై ప్రభుత్వ కఠిన చర్యలు

2021-22 నుంచి 2023-24 వరకు WGL, HNK, MHBD, JNG, BPL, MLG జిల్లాల్లో 32 మంది మిల్లర్లు 74,818 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పెట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మిల్లర్లను డీఫాల్టర్ జాబితాలో చేర్చి, సీఎంఆర్ ధాన్యం కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,220 కేంద్రాల్లో 28.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొననున్నారు.
Similar News
News October 23, 2025
విజయవాడ-సింగపూర్ విమాన బుకింగ్స్ ప్రారంభం

నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ‘విజయవాడ-సింగపూర్’ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను ఇండిగో సంస్థ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది. ఈ విమాన సర్వీసులు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నడవనున్నాయి. టికెట్ ధర రూ.7,500గా నిర్ణయించారు.
News October 23, 2025
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.
News October 23, 2025
జూబ్లీహిల్స్‌లో 100 మంది రౌడీషీటర్లు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా పెట్టారు. నియోజకవర్గ పరిధిలో 100 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ PS పరిధిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక్కరు, మధురానగర్‌లో 19 మంది, గోల్కొండలో ఒక్కరు, బోరబండలో 71 మంది, టోలిచౌకిలో నలుగురు, పంజాగుట్టలో ఇద్దరు ఉన్నారు.