News March 7, 2025
వరంగల్ నగరంలో పోలీసుల పుట్ పెట్రోలింగ్

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వరంగల్ డివిజినల్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ నేతృత్వం పోలీసులు మండిబజార్, చార్ బోలి ప్రాంతాల్లో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.
Similar News
News March 7, 2025
గాజా నుంచి పారిపోండి: హమాస్‌కు ట్రంప్ అల్టిమేటం

బందీలను విడిచిపెట్టి గాజా నుంచి పారిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా హమాస్‌పై ట్రంప్ ధ్వజమెత్తారు. ‘మరణించినవారి మృతదేహాలను తక్షణమే అప్పగించండి. బందీలను విడుదల చేయండి. లేదంటే నరకం అనుభవిస్తారు. మిమ్మల్ని చంపడానికి ఇజ్రాయెల్‌కు అవసరమైనవన్నీ ఇస్తా. ఒక్క హమాస్ సభ్యుడు కూడా ప్రాణాలతో ఉండడు. తెలివైన నిర్ణయం తీసుకోండి’ అని ఫైర్ అయ్యారు.
News March 7, 2025
NRPT: మూడు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం

నారాయణపేట పట్టణ ప్రజలకు మూడు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిపివేసినట్లు మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని సింగారం కూడలిలో తాగునీటి పైప్ లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులు సరఫరా ఉండదని చెప్పారు. మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ కోరారు.
News March 7, 2025
గద్వాల: ఏడు మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి

జోగులాంబ గద్వాల జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. జోగులాంబ గద్వాల జోన్ DIG ఎల్.ఎస్. చౌహన్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. ఈ సందర్భంగా DIG ఎల్.ఎస్. చౌహన్ పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.