News February 18, 2025

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు: టీకే శ్రీదేవి

image

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్‌ సేవా పథకం’లో భాగంగా వరంగల్‌ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.

Similar News

News October 21, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 21, 2025

ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ప్రసారభారతి<<>> 59పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News October 21, 2025

రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

image

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.