News August 14, 2024

వరంగల్ నగర ఏకీకరణకు మరో ఉద్యమం: సంపత్ రెడ్డి

image

వరంగల్, హనుమకొండగా విస్తరించి ఉన్న వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా గుర్తించేందుకు మరో ఉద్యమం చేపట్టనున్నట్లు మహానగర ఏకీకరణ పునర్నిర్మాణ కమిటీ తీర్మానించింది. మంగళవారం కాజీపేటలోని బాలవికాస కేంద్రంలో కమిటీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు, కమిటీ కన్వీనర్ వెంకటనారాయణ, కర్ర యాదవ రెడ్డి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 27, 2024

వరంగల్ రీజియన్‌లో 170 ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు వరంగల్ రీజియన్‌లో 170 పోస్టులు కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.

News November 27, 2024

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: సీతక్క

image

రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని, రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.

News November 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానా
> HNK: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
> NSPT: గంజాయి పట్టివేత
> WGL: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
> JN: గుట్కా పట్టివేత
> WGL: ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
> MHBD: రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి!
> HNK: పరకాల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్ అందజేత