News December 30, 2025

వరంగల్: నామినేటెడ్ పదవులపై నేతల్లో ఆశలు..!

image

పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల రద్దుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ నెల 19న వచ్చిన ఉత్తర్వులు ఆశావహుల్లో ఉత్సాహం నింపాయి. జిల్లాలో 99 పీఏసీఎస్‌లు ఉండగా వాటి సంఖ్య పెంచే యోచన ఉంది. డీసీసీబీ ఛైర్మన్ పదవులు ఒకటి నుంచి ఆరుకు పెరిగే అవకాశం. ఈసారి ఎన్నికల బదులు నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

Similar News

News February 19, 2026

గర్భనిరోధక మాత్రలను ఎప్పుడు తీసుకోవాలి?

image

అసురక్షిత సంభోగం జరిగిన 72 గంటల్లోపు ఒక మాత్రను తీసుకుంటే ఉత్తమ ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ వైద్యుడి సిఫార్సు మేరకు దీన్ని 5 రోజుల వరకు తీసుకోవచ్చు. అయితే మీరు సంభోగంలో పాల్గొన్న అనంతరం టాబ్లెట్‌ను ఎంత త్వరగా తీసుకుంటే గర్భం రాకుండా ఉండే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. సంభోగంలో పాల్గొని 72 గంటలు గడిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.

News February 19, 2026

జమ్మికుంట: స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,500 పలుకగా.. బుధవారం రూ.50 పెరిగి రూ.7,550 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం మార్కెట్‌కు రైతులు 34 వాహనాల్లో 244 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్‌కు పత్తిని తీసుకువచ్చే రైతులు నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News February 19, 2026

పొదిలి: ఒక్కో ప్లేట్‌కు రూ.50.. మిమ్మల్నీ అడిగారా?

image

పొదిలిలో విద్యుత్ సర్వీసు నంబర్ ప్లేట్లు బిగించి ప్రతి ఒక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. పాత ప్లేట్ ఉన్నప్పటికీ.. తప్పనిసరిగా కొత్త ప్లేట్ పెట్టాలంటూ తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా.. తమకు సంబంధం లేదని.. ప్రైవేట్ కాంట్రాక్టర్ వాటిని బిగిస్తున్నారని చెప్పారు.