News October 14, 2025
వరంగల్ నిట్‌లో ఆయారే టెక్నోజియాన్

వరంగల్ నిట్‌లో సాంకేతిక సంబరం టెక్నీజియాన్-2025 ప్రారంభం కానుంది. ఈనెల 24, 25వ తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.2,00,000 విలువైన బహుమతి నిధితో పాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్‌లతో నిండి ఉండే ఈ ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుకగా జరుపుకునే వేదికగా నిలవనుంది.
Similar News
News October 14, 2025
RR: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు ఇవ్వొద్దు’

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ వనజాత, డీఏఓ ఉష తదితరులు పాల్గొన్నారు.
News October 14, 2025
కరీంనగర్: ష్.. గప్ చుప్.. గ్రామాలన్నీ సైలెంట్

మొన్నటి వరకు ఉమ్మడి KNRజిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ‘అన్న నేను సర్పంచ్‌కు నిల్సుంటున్న. తమ్ముడు నీ ఓట్ నాకే వేయాలి’ అని సర్పంచ్ ఆశావాహులు చిన్నపాటి ప్రచారం చేశారు. కొందరైతే దసరా దావత్‌లు కూడా ఇచ్చారు. ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్స్‌పై HC స్టే ఇవ్వడంతో వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. గ్రామాల్లో ప్రచార సందడి తప్పి సైలెంట్‌గా మారింది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు.
News October 14, 2025
సిరిసిల్ల: ‘వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి’

రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా లావాదేవీలు జరగని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ మేరకు సిరిసిల్లలో మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కేవైసీ చేయించుకుని మళ్ళీ వారి అకౌంటుని ఆక్టివేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. 10 సంవత్సరాలకు పైగా క్లైమ్ చేయని డిపాజిట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ కి బదిలీ చేయబడ్డాయన్నారు.