News November 6, 2025
వరంగల్ నిట్‌లో ఉచితంగా GATE కోచింగ్

వరంగల్ నిట్(NIT)లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచితంగా GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 2026 జనవరి 9 వరకు ఈ కోర్సు 8 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాల కోసం ఎస్సీ-ఎస్టీ సెల్, నిట్ వరంగల్‌ను సంప్రదించాలని కోరారు.
Similar News
News November 6, 2025
HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.
News November 6, 2025
అమన్‌జోత్ మంచి మనసు.. ❤️

భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ప్రతికా రావల్ (308 రన్స్)కు విన్నింగ్ మెడల్ దక్కని విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆమెను 15 మెంబర్ స్క్వాడ్ నుంచి తప్పించడంతో ఆమెకు మెడల్ ఇవ్వలేదు. అయితే నిన్న ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ తన మెడలోని విన్నింగ్ మెడల్‌ను రావల్‌కు ఇచ్చారు. కౌర్ మెడల్ లేకుండా ఫొటో దిగారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News November 6, 2025
NZB: రాష్ట్ర స్థాయి మల్కంబ్లో జిల్లాకు 3వ స్థానం

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మల్కంబ్ పోటీలలో నిజామాబాద్ జిల్లా అండర్- 17 బాలికల ఛాంపియన్షిప్లో 3వ స్థానం దక్కించుకుంది. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో జరిగిన ఈ పోటీలలో మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు బాలికలు ఆయా కేటగిరీలలో మెడల్స్ సాధించారు. దీంతో ఛాంపియన్షిప్లో 3వ స్థానం దక్కింది. జిల్లా బృందానికి PD సంతోషి కోచ్‌గా వ్యవహరించారు.


