News July 9, 2025
వరంగల్ నిట్‌లో తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం

వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో రాష్ట్రంలోనే తొలిసారిగా ఐ స్టెమ్ సమావేశం నిర్వహించారు. బుధవారం నిట్ ఆడిటోరియంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ‘ఎంపవరింగ్ రీసెర్చ్ త్రూ షేర్డ్ సైన్టిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ అనే థీమ్‌తో సమావేశం నిర్వహించారు. అన్ని రంగాలకు సాంకేతికతను అందించడమే ఐ స్టెమ్ లక్ష్యం అని వక్తలు పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
గిరి ప్రదక్షణలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకి చేర్చిన పోలీసులు

సింహాచలం “గిరి ప్రదక్షణ”లో పైనాపిల్ కాలనీ సమీపంలో రెండు సంవత్సరాల బాలుడు దిక్కుతోచని స్థితిలో తిరగడం పోలీసులు గమనించి వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. వెంటనే పోలీసులు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా బాలుడు గుర్తులు తెలియజేస్తూ ప్రకటన చేశారు. బాలుడు తల్లి అది విని సమీపంలో పోలీసులు ద్వారా అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆమెకు క్షేమంగా అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News July 9, 2025
గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు: జేసీ

జిల్లాలో గ్రంథాలయాల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని జేసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్‌ఛార్జ్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్ సమావేశం జేసీ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పౌర గ్రంథాలయశాఖ డైరెక్టర్ సూచనలు, కేటాయించిన బడ్జెట్‌కు అనుగుణంగా, త్వరలో జరగబోయే సర్వసభ్య సమావేశం గురించి, ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో చర్యలు గురించి చర్చించారు.
News July 9, 2025
అర్ధరాత్రి అప్పన్నకు చందనం సమర్పణ

సింహాచలం అప్పన్న స్వామికి అర్ధరాత్రి పౌర్ణమి సందర్భంగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. దీంతో స్వామివారు పరిపూర్ణంగా నిత్య రూపంలోకి మారుతారు. 2 గంటల సమయంలో సుప్రభాత సేవ అనంతరం చందనం సమర్పిస్తారు. అనంతరం 3గంటలకు ఆరాధన, బాల భోగం, రాజ భోగం నిర్వహిస్తారు. గిరి ప్రదక్షణ చేసిన భక్తులకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.