News May 7, 2024

వరంగల్: నిన్నటిలాగే తటస్థంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర నిన్నటిలాగే తటస్థంగా ఉంది. సోమవారం రూ.6,725 పలికిన క్వింటా పత్తి .. ఈరోజు సైతం రూ.6,725 ధరే పలికింది. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకుని తమ సరుకులను మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News July 9, 2025

డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్‌లో చదవాలి: కలెక్టర్

image

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్  పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

News July 9, 2025

వరంగల్: రేపు ప్రభుత్వ పాలిటెక్నీక్ కాలేజీలో నేషనల్ వర్క షాప్

image

వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో గురువారం భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ(DST), తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన సాంకేతిక మండలి ఆధ్వర్యంలో వన్ డే వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల మేధో సంపత్తి హక్కుల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.ప్రభాకర్ తెలిపారు.

News July 8, 2025

WGL: నేడు 118 విద్యాలయాల్లో ‘స్ఫూర్తి’

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో స్ఫూర్తి
కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 118 విద్యాలయాల్లో బ్యాంకర్లు, జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు సమాజంలో జరుగుతున్న సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.