News April 13, 2024
వరంగల్: నిన్న మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్, BJP నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో వారంతా వేర్వేరు పార్టీల నుంచి బరిలో ఉన్నారు.
Similar News
News December 17, 2025
చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
News December 17, 2025
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News December 17, 2025
ఎంజీఎం వార్డులోకి కుక్క.. ఇద్దరికి షోకాజ్ నోటీసులు

వరంగల్ MGM ఆసుపత్రిలో మరోసారి భద్రతా లోపాలు బయటపడ్డాయి. గతంలో ఎలుకలు కొరికిన ఘటన జరిగిన అదే వార్డులోకి తాజాగా ఒక కుక్క ప్రవేశించడం కలకలం రేపింది. రోగి బంధువులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో విధుల్లోని ఇద్దరు సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల వైఫల్యానికి తమను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


