News October 7, 2025

వరంగల్: నిర్దేశించిన సమయంలో షాపుల మూసివేత

image

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, చోరీల నియంత్రణకై వరంగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో నిర్దేశించిన సమయంలోనే దుకాణాలను మూయించేందుకు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో దుకాణాలను సమయానికి మూయించేస్తున్నారు.

Similar News

News October 7, 2025

NZB: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమురం భీం: కల్వకుంట్ల కవిత

image

జల్, జంగల్, జమీన్ అనే గొప్ప సంకల్పంతో ఆదివాసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వీరుడు కొమురం భీం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందన్నారు. అలాంటి మహానీయుడి త్యాగాలను ఆయన వర్థంతి సందర్భంగా మరోసారి స్మరించుకుందామన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

image

TG: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.

News October 7, 2025

పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

image

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్‌లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.