News July 14, 2024
వరంగల్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
తమిళనాడులోని అరుణాచల దేవాలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం వరంగల్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈనెల 19నుంచి 22 వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని, ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Similar News
News November 28, 2024
డివిజన్ హోదాను కల్పించేందుకు కార్యాచరణను ప్రారంభించడం గర్వకారణం: మంత్రి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఒక్కో హామీని పోరాడి సాధించుకుంటున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌కు డివిజన్ హోదాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించడం యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి సురేఖ అన్నారు.
News November 28, 2024
ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష
ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే ఆన్‌లైన్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చేయాలని అధికారులను HNK జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పేమెంట్ చెల్లింపుల అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
News November 28, 2024
MHBD: దీక్షదివస్ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ ఎంపీ కవిత
రేపు దీక్షదివాస్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగే ఏర్పాట్లను గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి దీక్షదివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఆమె వెంట డోర్నకల్ మాజీ MLA రెడ్యా నాయక్, తదితరులు ఉన్నారు.