News February 11, 2025

వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.

Similar News

News November 5, 2025

NLG: ఎట్టకేలకు రేషన్ సంచుల పంపిణీ!

image

రేషన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేషన్ సంచులు పంపిణీ చేయనున్నారు. గత నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంచులను ఐఎంజీ గోదాములకు సరఫరా చేసింది. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కోర్టు పరిధిలో ఉండడంతో సంచులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఎంజీ స్టాక్ పాయింట్ల నుంచి ఆయా రేషన్ షాపులకు సంచులు చేరాయి.

News November 5, 2025

NLG: కలకలం రేపుతున్న మహిళల అదృశ్యం ఘటనలు

image

జిల్లాలో మహిళల అదృశ్యం ఘటనలు కలకలం రేపుతుంది. తిప్పర్తి పీఎస్ పరిధిలో కాజీరామారం గ్రామానికి చెందిన కందుకూరి సౌజన్య(24), చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన వివాహిత మంకాల రేణుక(35)లు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ కూడా వివాహితులే కావడం విశేషం.

News November 5, 2025

కులవృత్తికి పేటెంట్ ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

image

జిల్లాలోని పలువురు నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తమ పూర్వీకుల క్షురవృత్తి సంప్రదాయాన్ని కాపాడి నాయీబ్రాహ్మణులకే పరిమితం చేయాలని కలెక్టర్‌ను కోరారు. రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, తిరుపతి నగర అధ్యక్షుడు సహదేవ జయకుమార్ నాయకత్వంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 3,750 మంది నాయీబ్రాహ్మణులు సెలూన్లపై ఆధారపడి ఉన్నారని, ఇతర కులస్తులు ప్రవేశించడంతో వృత్తి గౌరవం, ఆదాయం దెబ్బతింటుందన్నారు.