News March 7, 2025
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News December 14, 2025
SRD: ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ అభ్యర్థి గెలుపు

రాయికోడ్ మండలం పీపడ్ పల్లి గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థి పై విజయం సాధించారు. తాను నమ్ముకున్న వారు మోసం చేశారని ఆరోపిస్తూ వారం రోజుల క్రితం రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతి చెందిన రాజు విజయం సాధించడంతో ఈ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.
News December 14, 2025
ధన్వాడలో బీజేపీ అభ్యర్థి పి.జ్యోతి రామచంద్రయ్య విజయం

ధన్వాడ మండల కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పుట్టిన ఊరిలో బీజేపీ అభ్యర్థి పి.జ్యోతి రామచంద్రయ్య సమీప అభ్యర్థి జ్యోతిపై 617 ఓట్లు గెలుపొందారు. ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నూతన సర్పంచ్ పి.జ్యోతి తెలిపారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోడలుపై అత్త ఎంపీ డీకే అరుణమ్మ విజయం సాధించారు. బీజేపీ పార్టీ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.
News December 14, 2025
తంగళ్ళపల్లి మండలంలో పట్టునిలుపుకున్న BRS

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలంలో 30 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 17 స్థానాలు దక్కించుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 4 స్థానాల్లో గెలిచారు. తంగళ్లపల్లి మండలంలో 17 స్థానాలతో అగ్రస్థానంలో నిలవడం పట్ల ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు.


