News July 18, 2024
వరంగల్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు

ఉపాధ్యాయ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-2024 ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 27,740 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం హనుమకొండ నగరం, పరిసరాల్లో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సారి ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహిస్తున్నారు.
Similar News
News February 19, 2026
మిర్చి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

మార్కెట్‌లో మిర్చికి మంచి ధరలు ఉన్నప్పటికీ, రైతులు నాణ్యతపై దృష్టి పెట్టకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. ఎనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి సీజన్ పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. తేమతో కూడిన మిర్చిని తీసుకురావడం వల్ల రంగు మారి నాణ్యత దెబ్బతింటోందని, ఫలితంగా విదేశీ వ్యాపారులు కొనుగోలుకు విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు.
News February 19, 2026
10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో డీఈఓ రంగయ్య నాయుడుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,492 మంది ఉన్నారని, ఫలితాల మెరుగుదలకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని హెడ్ మాస్టర్లను ఆదేశించారు.
News February 18, 2026
అంగన్వాడీ సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వీడాలి: కలెక్టర్

అంగన్వాడీ సూపర్‌వైజర్లు పని తీరులో నిర్లక్ష్యం, లక్ష్యాలు సాధించడంలో వెనుకబడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొంతమంది సూపర్‌వైజర్లపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. CDPOలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, సేవల అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.


