News October 27, 2025

వరంగల్: నేడు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభిస్తున్నట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 గా నిర్ణయించింది. రైతులు సీసీఐ నిబంధనల ప్రకారం కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.

Similar News

News October 27, 2025

వికారాబాద్: లక్ ఎవరిదో కాసేపట్లో తేలనుంది

image

వికారాబాద్ జిల్లాలోని 59 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన డ్రా తీసేందుకు ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వికారాబాద్ అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు. డ్రా కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని, ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News October 27, 2025

‘ఇంతకీ జూబ్లీహిల్స్‌లో ఏం అభివృద్ధి చేస్తారంట’

image

తెలంగాణలో ఖరీదైన ఏరియా అంటే జూబ్లీహిల్స్ గుర్తొస్తుంది. ఇక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. తిరగని సెలబ్రెటీ ఉండరు. కొండ ప్రాంతం ఎవరి ఊహలకు అందనంత అభివృద్ధి చెందింది. బైపోల్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి తమ పార్టీలతోనే సాధ్యమని నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తమ ప్రాంతాన్ని జూబ్లీహిల్స్‌ అంత అభివృద్ధి చేస్తామని చెబుతుంటే, కొత్తగా ఇక్కడ ఏంఅభివృద్ధి చేస్తారో చెప్పకపోవడం ఓటర్లకు అంతుచిక్కని ప్రశ్న.

News October 27, 2025

చిరంజీవి సినిమాలో కార్తీ!

image

చిరంజీవితో డైరెక్టర్ బాబీ తెరకెక్కించనున్న సినిమాలో హీరో కార్తీ నటించనున్నట్లు తెలుస్తోంది. బాబీ చెప్పిన గ్యాంగ్‌స్టర్ కథకు కార్తీ ఓకే చెప్పారని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి 2027 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నట్లు టాక్. హీరోయిన్‌గా మాళవిక మోహనన్, రాశీ ఖన్నాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి.