News December 14, 2025
వరంగల్: నేడే ఎన్నికలు.. 508 జీపీలకు ఎన్నికలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 27 మండలాల్లోని 564 జీపీల్లో 56 ఏకగ్రీం కాగా, మిగతా 508 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 1,686 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 4,937 వార్డుల్లో 917 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 4,020 వార్డులకు 9,884 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
Similar News
News December 14, 2025
గద్వాల్: మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప స్వగ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందాడు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పరి వెంకటేష్ 60 ఓట్ల తేడాతో గెలుపు సాధించాడు. బీఆర్ఎస్ పార్టీలో ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమితో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
News December 14, 2025
విశాఖ ఉక్కు పరిశ్రమలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్ CMD వల్లే నష్టాల బారిన పడుతోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. క్వాలిటీ లేని ఉక్కు తయారీ, అక్రమాలపై CBI విచారణ చేయాలని ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. పదవీకాలం ముగుస్తున్న CMDని కొనసాగించవద్దని MLAలు CMకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రైవేటీకరణ విషయం వెనక్కి తగ్గడం లేదు. ప్లాంట్ ఆపరేషన్ విభాగం ప్రైవేటికరణకు టెండర్లను ఆహ్వానించింది.
News December 14, 2025
భారత్ బౌలింగ్.. బుమ్రా స్థానంలో హర్షిత్

సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగే మూడో టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. స్టార్ పేసర్ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.


