News March 5, 2025

వరంగల్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12,321 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 5,815, సెకండియర్‌లో 6,506 మంది విద్యార్థులు రాయనుండగా.. 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఘూ తెలిపారు. కాగా, పరీక్షకు 30 ని.మి.కు ముందే సెంటర్‌కు చేరుకోండి.
ALL THE BEST

Similar News

News March 5, 2025

WGL: శిరీష హత్య కేసులో కీలక మలుపు

image

HYD మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 5, 2025

వరంగల్ నేటి మార్కెట్లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల మిర్చి ధరలు ఎలా ఉన్నాయి. నిన్న క్వింటా తేజ మిర్చి ధర రూ.14,200 ధర పలకగా.. నేడు రూ.14,000కి పడిపోయింది. అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,100 ధర రాగా.. నేడు రూ. 14,600కి పెరిగింది. మరోవైపు వండర్ హాట్(WH) రకం మిర్చి నిన్న రూ.17,200 ధర పలకగా.. ఈరోజు రూ.16,800 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

News March 5, 2025

వరంగల్ జిల్లాలో మండుతున్న ఎండ!

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 35 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతవరణ సూచికలు చెబుతున్నాయి.

error: Content is protected !!