News March 18, 2025
వరంగల్: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 9,237 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News March 19, 2025
ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలి: కలెక్టర్

రైతులు తక్కువ నీరు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సత్య శారద కోరారు. కలెక్టరేట్లో రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. రైతులు వరి, మొక్కజొన్న, పంటల సాగు పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి చేయవలసి వస్తుందన్నారు.
News March 18, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.15,800(నిన్న 16వేలు) పలకగా.. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.11,000 ధర వచ్చింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.33వేలు (నిన్న రూ.32వేలు) ధర, ఎల్లో మిర్చికి రూ.20,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.
News March 18, 2025
హసన్‌పర్తి: యాక్సిడెంట్.. ఇద్దరు విద్యార్థులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పరకాల బీసీ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు సుశాంత్, వర్ధన్, విజయ్ ఆదివారం రాత్రి పరకాల నుంచి ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా.. విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. ముచ్చర్ల శివారులో వీరి బైకును ఓ వాహనం ఢీకొనడంతో సుశాంత్, విజయ్ మృతి చెందారు. వర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.