News September 23, 2025
వరంగల్ పరిధిలో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 17 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 16 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 23, 2025
ఖమ్మం: ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతనగర్ గ్రామం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 23, 2025
పెరవలిలో రోడ్డు ప్రమాదం

తూ.గో జిల్లా పెరవలి మండలం తీపర్రు పరిధిలో మంగళవారం RTC బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 23, 2025
మేడారం: PIC OF THE DAY

ములుగు జిల్లాలోని మేడారం పర్యటనలో భాగంగా సమ్మక్క, సారలమ్మ దేవతలను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే సమయంలో సీఎం రేవంత్ పక్కన మంత్రులు సీతక్క, సురేఖ ఇద్దరు ఒకేసారి గంట కొడుతున్న దృశ్యం నేటి ఫొటో ఆఫ్ ద డేగా నిలిచింది. అనేక సందర్భాల్లో సీతక్క, సురేఖలను సమ్మక్క, సారక్కలుగా వర్ణించడం మనం వింటూనే ఉన్న విషయం తెలిసిందే.