News January 6, 2026

వరంగల్ పరిధిలో 92 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 92 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 89 మంది మద్యం తాగిన వారితో పాటు ముగ్గురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారు ఉన్నారని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 15, 2026

అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్: CM

image

TG: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని CM రేవంత్ తెలిపారు. HYDలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘4నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నా. ఈ ప్రస్థానంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారు. భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించకూడదు. బాగా చదువుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 15, 2026

MNCL: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

image

కార్పొరేషన్ రాజకీయాల్లో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టారు. MNCL 23వ డివిజన్ కార్పొరేటర్ శంకర్, 45వ డివిజన్ సునీత, 47వ డివిజన్ సాయికృష్ణ ఆదివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చేరికను వారు స్వయంగా ధ్రువీకరించారు. వీరితో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు కూడా త్వరలో హస్తం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

News February 15, 2026

భద్రాద్రి: పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

image

మహాశివరాత్రి పర్వదినాన మణుగూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టు ఉడతనేని గుంపు ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుప సుదీర్‌(21) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పండుగ పూట చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.