News November 19, 2025
వరంగల్: పాక్స్‌లు ఎలా బలోపేతం అవుతున్నాయో తెలుసా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్టీ సర్వీసు సెంటర్(MSC) స్కీమ్ ద్వారా DCC బ్యాంక్ పీఏసీఎస్‌లకు కేవలం 1% వడ్డీకే రుణాలు అందిస్తోంది. గతంలో పంట రుణాలకే పరిమితమైన PACSలు ఇప్పుడు ఈ రుణాలను పెట్టుబడులుగా మల్చుకుని సొంత ఆస్తుల నిర్మాణం, కొత్త ఆదాయ వనరుల సృష్టిలో ముందంజలో ఉన్నాయి. అద్దె భవనాల నుంచి స్వంత భవనాల్లో సేవలు అందిస్తూ ఆర్థికంగా బలపడుతున్నాయి. అందుకే మన ఛైర్మన్ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వస్తున్నారు.
Similar News
News April 13, 2026
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 63 వినతులు అందగా, వాటిపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం పోషణ్ పక్వాడా, పీఎం ఇంటర్న్‌షిప్ పథకాల పోస్టర్లను ఆవిష్కరించారు.
News April 13, 2026
బెంగాల్ ‘SIR’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ఒత్తిడిలో ఓటర్ల హక్కును కాలరాయొద్దని, పుట్టిన దేశంలో ఓటరుగా కొనసాగే హక్కు రాజ్యాంగబద్ధమని CJI సూర్యకాంత్ బెంచ్ పేర్కొంది. బెంగాల్ ‘SIR’లో ఓట్లు కోల్పోయిన వారి పిటిషన్లను విచారిస్తూ.. అప్పీళ్లను పరిష్కరించేందుకు పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలంది. ఏప్రిల్ 23, 29న జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఓటరు తుది జాబితాకు గడువు ముగిసినా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని వ్యాఖ్యానించింది.
News April 13, 2026
ప్రతి దరఖాస్తును తక్షణమే పరిష్కరించాలి: నిర్మల్ కలెక్టర్

ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అత్యధికంగా విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.


