News September 23, 2025
వరంగల్: పెరిగిన చిరుధాన్యాల ధరలు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే మంగళవారం చిరుధాన్యాల ధరలు పెరిగాయి. సూక పల్లికాయ క్వింటా నిన్న రూ.6,000 ధర పలకగా.. నేడు రూ.6,500 ధర వచ్చింది. అలాగే పచ్చి పల్లికాయకి నిన్న రూ.3,300 ధర వస్తే.. నేడు రూ.4,500 అయింది. మక్కలు(బిల్టీ)కి నిన్న రూ.2,215 ధర రాగా.. నేడు రూ.2,230 వచ్చింది. మరోవైపు దీపిక మిర్చి రూ.14 వేలు, ఎల్లో రకం మిర్చి రూ.22 వేలు, పసుపు(MB) రూ.7560 ధర పలికాయి.
Similar News
News September 23, 2025
WGL: పెరిగిన కొత్త పత్తి ధర.. స్థిరంగా పాత పత్తి

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పాతపత్తి, కొత్త పత్తి ధరలు ఇలా ఉన్నాయి. సోమవారం పాత పత్తి క్వింటా రూ.7,370 ధర పలకగా.. నేడు కూడా అదే ధర పలికింది. అలాగే కొత్త పత్తి క్వింటాకు నిన్న రూ.7,011 ధర ఉండగా మంగళవారం రూ.7,100కి చేరింది. దసరా నుంచి దీపావళి పండుగ మధ్యలో కొత్త పత్తి మార్కెట్‌కు వస్తుందని వ్యాపారులు తెలిపారు.
News September 23, 2025
వరంగల్: డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు లొంగొద్దు

డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకునే మోసగాళ్లపై వరంగల్ పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ అన్నది అసలే లేదు. మనీలాండరింగ్, డ్రగ్స్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే నమ్మకండి అని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి మోసపూరిత కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీ భయమే వారి పెట్టుబడి-విజ్ఞతతో వ్యవహరించండి అన్నారు.
News September 23, 2025
వరంగల్: కొలువుదీరిన అమ్మవారి విగ్రహాలు..!

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలో అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు యువకులు భవాని మాత మాలలను ధరించారు. మండపాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతిరోజు అలంకరణలు చేయడానికి గాను యువకులు భవానిమాలలు వేసుకున్నారు. మంగళవారం గాయత్రి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.