News November 19, 2024

వరంగల్: పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా మక్కలు (బిల్టి) ధర రూ. 2,425 పలకగా నేడు (మంగళవారం) రూ.5 పెరిగి రూ.2,430కి చేరింది. అలాగే 341 రకం కొత్తమిర్చి నేడు మార్కెట్‌కి తరలిరాగా క్వింటాకు రూ. 13,500 ధర పలికిందని అధికారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Similar News

News December 3, 2024

WGL: ప్రతి ఇంటికి వెలుగులు తీసుకువస్తా: మంత్రి కొండా సురేఖ

image

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెలుగులు తీసుకువస్తామని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. గత ఏడాది ఇదే రోజున వరంగల్ తూర్పు ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ప్రజల ఆకాంక్షలన్నీ అమలు చేస్తూ ముందుకు సాగుతుంటానని మంత్రి తెలిపారు.

News December 3, 2024

REWIND.. వరంగల్: 10స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

image

నవంబర్ 30వ తేదీ 2023వ జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భూపాలపల్లి, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ములుగు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

News December 3, 2024

వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,000 ధర రాగా నేడు రూ.15,300కి పెరిగింది. అలాగే కొత్త తేజా మిర్చికి నిన్నటిలాగే రూ.14,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు 341 రకం మిర్చి నిన్న రూ.13,500 పలకగా, నేడు రూ.14,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చికి సోమవారం రూ.11,000 ధర రాగా నేడు రూ.14వేలు వచ్చిందన్నారు.