News May 24, 2024

వరంగల్: పెరుగుతున్న పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత 3 రోజులతో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,040, మంగళవారం రూ.7,070 పలికింది. గురువారం రూ.7,210 ధరతో పోలిస్తే మరింత పెరిగి రూ.7,245 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News November 5, 2024

రాహుల్ గాంధీని కలిసిన మంత్రి కొండా సురేఖ

image

హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో కలిసి మంత్రి కొండా సురేఖ కలిశారు. అనంతరం పలు అంశాలపై రాహుల్ గాంధీ, నేతలతో మంత్రి కొండా సురేఖ చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్సి, తదితరులు ఉన్నారు.

News November 5, 2024

WGL: KU ఫీజు చెల్లింపునకు రేపే ఆఖరు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు KU అధికారులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

News November 5, 2024

మాల విరమణకు బయలుదేరిన నాగేంద్ర స్వామి మాలధారణ స్వాములు

image

గీసుకొండ మండలంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో 41 రోజుల మండల దీక్షలు తీసుకున్న నాగేంద్ర స్వామి భక్తులు నాగుల చవితి సందర్భంగా ఈరోజు మాలవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు పాల కావడులతో ఊరేగింపుగా తిరిగి మంగళ వాయిద్యాలతో దేవాలయానికి చేరుకున్నారు. నాగేంద్ర స్వామి దేవాలయం హరోం హర అనే నినాదాలతో మార్మోగింది.