News December 17, 2025
వరంగల్: పోలింగ్ ప్రారంభం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 530 పంచాయతీలకు ఎన్నిక జరుగుతోంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చలి కారణంగా ఉదయం ఓటర్లు ఒక్కొక్కరుగా తరలివస్తున్నారు.
Similar News
News December 19, 2025
NZB: 20న కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం: కలెక్టర్

వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన 3 నెలల ప్రత్యేక కార్యక్రమం ‘ మీ డబ్బు- మీ హక్కు’ లో భాగంగా ఈ నెల 20న కలెక్టరేట్ లో జిల్లా స్థాయి శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. క్లెయిమ్ చేసుకోని బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నామన్నారు.
News December 19, 2025
HYD: దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం ఎక్కడంటే?

‘ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!’ శీర్షికన Way2Newsలో కథనం వెలువడడంతో జనాల్లో చర్చ హోరెత్తింది. నిర్మాణం ఎక్కడా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మేడ్చల్ (D) యమ్నాంపేట్ రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో 7ఎకరాల్లో 72 అంతస్తుల టవర్‌తో పాటు 62అంతస్తుల 2భవనాల నిర్మాణానికి ఓ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ‘డాన్సింగ్ డాఫోడిల్స్ థీమ్’తో రూపుదిద్దుకునే ఈ కట్టడం గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనువిందు చేయనుంది.
News December 19, 2025
బ్రిక్స్ పుస్తకాన్ని సీఎంకు అందజేసిన ఎంపీ శబరి

బ్రెజిల్‌లో జరిగిన 11వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌లో విడుదల చేసిన ప్రత్యేక పుస్తకాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సీఎం చంద్రబాబు నాయుడుకు శుక్రవారం అందజేశారు. ఈ పుస్తకంలో ఎంపీ ప్రసంగాలు, ఫొటోలు, ఆమె భాగస్వామ్య విశేషాలను పొందుపరచారు. మహిళా సాధికారత, AI, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్య విలువలపై గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతదేశం తరఫున గొంతు వినిపించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.


