News February 1, 2025
వరంగల్ పోలీసులకు పతకాలు
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.
Similar News
News February 1, 2025
NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి
నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్‌లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
News February 1, 2025
బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం
2025-26 బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటు భవనంలో సమావేశమైన క్యాబినెట్ పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఉ.11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మూడో టర్మ్‌లో ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.