News February 1, 2025

వరంగల్ పోలీసులకు పతకాలు

image

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

Similar News

News February 1, 2025

వరంగల్: ఆపరేషన్ స్మైల్ ద్వారా 161 చిన్నారులకు విముక్తి

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా జనవరిలో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 161 చిన్నారులకు విముక్తి కలిగించామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. వీరిలో 137 మంది బాలలు, 24 మంది బాలికలు ఉన్నారన్నారు. తనిఖీల్లో గుర్తించిన చిన్నారులను బాలల సంరక్షణ గృహానికి తరలించామని సీపీ తెలిపారు.

News February 1, 2025

WGL: ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 2304 మంది ఓటర్లు ఉన్నారని, 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, వీఎస్టీ మొదలగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

News February 1, 2025

నర్సంపేట: సెమిస్టర్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు స్థానిక నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ శనివారం తెలిపారు. 1, 3, 5 సెమిస్టర్ల పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 పొడిగించామన్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుంచి 6 వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు 7 నుంచి 13 వరకు ఉంటాయన్నారు.