News October 5, 2025

వరంగల్ పోలీసుల కీలక సూచనలు

image

ప్రజలు తమ బ్యాంక్‌ అకౌంట్‌ యాక్టివిటీని తరచూ పరిశీలించాలని వరంగల్ పోలీసులు సూచించారు. అనుమానాస్పదమైన ట్రాన్సాక్షన్లు గమనించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు. అలాగే తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్‌ చేయడం, క్యూఆర్‌ కోడ్స్‌ స్కాన్‌ చేయడం వంటి చర్యల వల్ల మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News October 5, 2025

వరంగల్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

News October 5, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా..!

image

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్‌ స్కిన్ కేజీ రూ. 200-210 ధర పలకగా.. స్కిన్‌లెస్ కేజీ రూ.230-250 గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.150-160 ధర పలుకుతున్నది. కాగా సిటీతో పోలిస్తే పల్లెలలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నది. గత వారం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మకాలు కొంత తగ్గగా.. ఈరోజు అమ్మకాలు కొంత పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

News October 5, 2025

వర్ధన్నపేట: బీర్ టిన్‌లో తలదూర్చి పాము మృతి

image

ఓ పాము బీర్ టిన్‌లో తలదూర్చి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కాలువ కట్టపై కనిపించింది. తాగి పడేసిన టిన్ బీర్‌లోకి పాము తల దూర్చడంతో తిరిగి బయటకు రావడానికి ఇబ్బందులు పడింది. ముందుకు, వెనక్కి వెళ్లినా బీర్ టిన్‌లో పెట్టిన తల బయటకు రాలేదు. బండారి కుమారస్వామి అనే గీత కార్మికుడు దీన్ని గమనించి అతని ఫోన్లో బంధించాడు.