News September 8, 2025
వరంగల్ పోలీసుల హెచ్చరిక

సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి టిప్స్, లింక్‌లను నమ్మి తెలియని యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో డబ్బులు పెట్టి మోసపోకూడదని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు. షేర్లలో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్స్ ద్వారానే జరుగుతుందని గుర్తుంచుకోవాలని పోలీసులు సూచించారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News September 9, 2025
ఆసిఫాబాద్: పోరాటంతోనే ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారం: TAGS

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆసిఫాబాద్ జిల్లా TAGS కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని కోరుతూ 91 గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేశామని సమావేశంలో తెలిపారు.
News September 9, 2025
రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక రవాణా

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మైనింగ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు రామ్ నరేశ్, సురేశ్ తెలిపిన వివరాలు.. రెబ్బన నుంచి బెల్లంపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు కన్నాల జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News September 9, 2025
HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.