News April 8, 2025
వరంగల్: ప్రజావాణికి 93 దరఖాస్తులు

వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారద దేవి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల నుంచి 93 దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సమస్యలపై 41, మిగతా శాఖల నుంచి 52 వచ్చాయి. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Similar News
News April 8, 2025
కేయూ: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
News April 8, 2025
HNK: ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్లే లహరి ఎక్స్‌ప్రెస్ బస్సుగా గుర్తించారు. గాయాలైన వారిని చికిత్స కోసం 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
ఖానాపురం: రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే

ఖానాపురం మండల కేంద్రంలో ముస్తఫా అనే రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సన్న బియ్యం భోజనం చేశారు. ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పథకాన్ని చేపడుతోందని దొంతి అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.