News February 14, 2026

వరంగల్: ప్రత్యర్థుల ఎగతాళి నుంచి మున్సిపల్‌లో గెలుపు వరకు!

image

తన రాజకీయ అనుభవం అంత లేని యువతి చేతిలో ఓటమి పాలయ్యావంటూ ప్రత్యర్థులు చేసే ఎగతాళి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఉపశమనం కలిగినట్లయింది. తొర్రూర్ మున్సిపాలిటీలో 16 వార్డులకు ఎన్నికలు జరిగితే , BRS 9, కాంగ్రెస్ 7 వార్డులను కైవసం చేసుకున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎర్రబెల్లి, విజయం సాధించకపోతే మరో అపవాదును మూట గట్టుకునే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News February 15, 2026

T20 WC: USA భారీ స్కోర్

image

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.

News February 15, 2026

రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

image

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.

News February 15, 2026

స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు: మమతా మోహన్‌దాస్

image

తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ <<10013472>>మమతా మోహన్‌దాస్<<>> తెలిపారు. ‘ఆ టైంలో ఓ ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని దాచి మోసం చేశాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో ప్రజిత్‌ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు.