News February 8, 2025

వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి రక్షించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు.

Similar News

News February 1, 2026

హనుమకొండ: మినీ మేడారం జాతరలో 13వేల మందికి చికిత్స

image

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన మినీ మేడారం జాతరలో 13,242 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు DMHO డా.అప్పయ్య తెలిపారు. హయగ్రీవాచారి మైదానం, ఆత్మకూరు, ఊరుగొండ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ఈ సేవలు అందజేశామన్నారు. మెరుగైన చికిత్స కోసం 19 మందిని పెద్దాసుపత్రికి తరలించామని, 10 మందికి కుక్కకాటు ఇంజక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

News February 1, 2026

రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేశాం: కలెక్టర్

image

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 45% జరిగిందని,100 శాతం పూర్తయ్యేలా అధికారులందరు సమన్వయంతో పని చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలో అమలు తీరును తెలిపారు.

News January 29, 2026

రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

image

మేడారం మహాజాతరను పురస్కరించుకుని ఈ నెల 30 (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు, సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని (రెండవ శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.