News December 20, 2025
వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రద్దు

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని డీసీసీబీ బ్యాంక్‌తో పాటు అనుబంధంగా ఉన్న 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకమండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. పాలకవర్గాల కాలపరిమితి ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సంఘాల రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా తక్షణమే పర్సన్ ఇన్‌చార్జిల నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. పీఏసీఎస్ పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యాకే కొత్త ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
Similar News
News December 21, 2025
కృష్ణా: మళ్లీ బీసీ వర్గానికి టీడీపీ జిల్లా పీఠం

టీడీపీ కృష్ణా జిల్లా పీఠం మరోసారి BC వర్గాలకే దక్కింది. BC (గౌడ) వర్గానికి చెందిన వీరంకి వెంకట గురుమూర్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. గత రెండు పర్యాయాలు కూడా BC వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణరావులే TDP జిల్లా అధ్యక్షులుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. గురుమూర్తి నాయకత్వంలో కూడా పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
News December 21, 2025
పాకిస్థాన్ భారీ స్కోరు

అండర్-19 మెన్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 347-8 పరుగులు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో ఏకంగా 172 రన్స్ బాదారు. ఇందులో 9 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. అహ్మద్ హుస్సేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) రాణించారు. భారత బౌలర్లలో దేవేంద్రన్ 3, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఒక వికెట్ తీశారు.
News December 21, 2025
TDP నెల్లూరు జిల్లా బాస్‌గా బీద రవిచంద్ర

అందరూ ఊహించినట్లే టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియమితులయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్లు వెంకటేశ్వర్లు రెడ్డికి అవకాశం ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు పోటీపడ్డారు. ఓ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పోటీపడగా.. బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం దక్కింది.


