News September 22, 2025

వరంగల్: బతుకమ్మను బతకనివ్వండి..!

image

బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామని లాస్యప్రియ అన్నారు. ఎంగిలి పూల బతుకమ్మ రోజున HNK నయీం నగర్ ప్రాంతానికి చెందిన లాస్య సాయి ప్రకాశ్ ఆడ పిల్లల్ని కడుపులో ఉండగానే చంపుతున్నరాని, అలా చంపడం నేరమని., వాటిని నిర్మూలించాలని కోరుతూ ప్లే కార్డ్ పట్టుకొని బతుకమ్మను బతకనిద్దాం.. భ్రూణ హత్యలు నివారిద్దామనే సందేశాన్ని అందించారు. వినూత్నంగా ఆలోచానను అందరు అభినందించారు.

Similar News

News September 22, 2025

నేటి నుంచి దుర్గా నవరాత్రులు.. బాలాత్రిపుర సుందరీగా అమ్మవారు

image

దేశవ్యాప్తంగా నేటి నుంచి దుర్గామాత నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాల్లో 11 రోజుల పాటు అమ్మవార్లు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఇవాళ బాలా త్రిపుర సుందరీదేవీగా కనిపించనున్నారు. అటు శ్రీశైలంలో భ్రమరాంభికా దేవి శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తారు. కాగా నేడు 2-10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీ.

News September 22, 2025

ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ వైజాగ్‌లో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది ‘సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్’ థీమ్‌తో ఈ కాంక్లేవ్‌ను నిర్వహిస్తున్నారు. AI, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి-స్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

News September 22, 2025

దసరా సెలవుల్లో ఊరేళ్లే వారికి సిరిసిల్ల ఎస్పీ సూచనలు

image

దసరా సెలవుల సందర్భంగా దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రజలను సూచించారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇంటికి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.