News May 10, 2024
వరంగల్: బాధితురాలి ఆత్మహత్యాయత్నం

ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు తెలియకుండానే గర్భసంచి తొలగించారని ఇటీవల ఓ మహిళ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సదరు మహిళ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నిద్రమాత్రలు మింగింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.
Similar News
News July 10, 2025
WGL: మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .
News July 10, 2025
వరంగల్: యూరియా కొరత.. నాట్లు వేసేదెలా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా 50 శాతం యూరియా జిల్లాకు రావాల్సి ఉందని వ్యవసాధికారులు చెబుతున్నారు. అయితే నారుమళ్లలో వరి నారు ముదిరిపోతోందని రైతులు దిగులు చెందుతున్నారు. సకాలంలో యూరియా అందజేస్తే వరి నాట్లు వేసుకుంటామని రైతులు అంటున్నారు. యూరియా అందక వర్షాలు పడక నారు మళ్లలోనే వరినారు ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
News July 10, 2025
పర్వతగిరి: హే మహాత్మా.. శిథిలావస్థకు గాంధీ విగ్రహం..!

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.