News December 13, 2025

వరంగల్: బాబోయ్.. అక్కడ పనిచేయడం కష్టమే!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ అధికారి పేరు చెబితే సిబ్బంది వణికిపోతున్నారు. అక్కడ ఆ అధికారి దగ్గర పనిచేయడానికి సైతం జంకుతున్నారు. 18 నెలల్లో 20 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఆరుగురు క్యాంప్ క్లర్క్‌లు, 10 మంది వంటవారిని మార్చడంతో ఆ అధికారి హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకు ఎందుకు మార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏ సెటిల్మెంట్లు లేకపోయినా సిబ్బందిని మార్చడం ఉద్యోగుల సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Similar News

News December 19, 2025

సమయం వచ్చేసింది.. టికెట్లు బుక్ చేసుకోండి!

image

శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, స్వామిని అతి సమీపం నుంచి దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇదే అవకాశం! 2026 మార్చి నెలకు సంబంధించి సేవా టికెట్ల ఆన్‌లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను TTD నిన్న ప్రారంభించింది. రేపు ఉదయం 11 గంటలకు ముగియనుంది. ఇందులో ఎంపికైనవారు శ్రీవారి మూలవిరాట్టును కేవలం 9 అడుగుల దూరం నుంచి దర్శించుకుంటారు. శ్రీవారి కృపకు పాత్రులు కావాలనుకునేవారు <>టికెట్లు<<>> బుక్ చేసుకోండి.

News December 19, 2025

రాజమండ్రి: 21న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

తూర్పుగోదావరి జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్.కే.వి.టి డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా 85 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు.

News December 19, 2025

VZM: ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద శిక్షణ నిమిత్తం హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 22 నుంచి 9 నెలల శిక్షణ ప్రారంభం కానుండగా.. పురుషులను డీటీసీ చిత్తూరు, మహిళలను పీటీసీ ఒంగోలుకు పంపిస్తామన్నారు. అవసరమైన పత్రాలు, రూ.10,000 కాషన్ డిపాజిట్‌, లగేజీతో రావాలని, బంధువులకు అనుమతి లేదన్నారు.