News November 10, 2025

వరంగల్: బాలికను వేధించిన ఘటన.. యువకుల దాడి

image

గ్రేటర్ వరంగల్ పరిధి కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద బాలికను వేధించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. వేధించిన యువకుడిని ప్రశ్నించినందుకు బాధితురాలి తండ్రి రాజేందర్, మామయ్య
రాకేశ్‌పై కొందరు యువకులు దాడికి దిగారు. దాడిలో గాయపడిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News November 10, 2025

తెలంగాణ న్యూస్

image

✦ దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌న్న CM రేవంత్.. రేపు మౌలానా జయంతి సందర్భంగా స్మరించుకున్న CM
✦ 2026 చివరి నాటికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
✦ ఈనెల 17, 18 తేదీల్లో HYD సమీపంలోని తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 163 రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల వేలం.. <>దరఖాస్తుకు<<>> ఈ నెల 15వరకు గడువు

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయండి!

image

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వమని చదువుకున్నాం.. ఇపుడు జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు కానీ.. నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు 58 మంది నాయకులు.. ‘‘మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం’’ అంటూ నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వారిలో మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి.. లేకపోతే కనీసం నోటాకు అన్న ఓటేయండి. ఇది మీ బాధ్యత.

News November 10, 2025

రేపు జిల్లాలో నాలుగు పరిశ్రమల స్థాపనకు CM ప్రారంభోత్సవం

image

జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.