News March 20, 2024

వరంగల్: బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి జైలు శిక్ష

image

మైనర్‌కు బైక్ ఇచ్చినందుకు ఓ తండ్రికి జైలు శిక్ష విధించిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే బాలుడు బైక్ నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో వాహనం సీజ్ చేసి కేసు నమోదుచేశారు. కాగా, బాలుడికి బైక్ ఇచ్చినందుకు తండ్రికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు.

Similar News

News September 3, 2025

వరంగల్: మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ ఆగ్రహం

image

మెనూ పాటించని హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పట్టణం చింతల్ యాకూబ్ పుర ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్‌ను కలెక్టర్ సత్య శారద మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం లేకపోవడం, లైటింగ్ సమస్యలు, ప్రాంగణంలో వరదనీరు నిలవడాన్ని ఆమె గమనించారు.

News September 3, 2025

వరంగల్: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

వరంగల్ పట్టణంలోని చింతల్ యఖుత్ పురలో ప్రభుత్వ తెలంగాణ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలోని సౌకర్యాలను, విద్యార్థుల అభ్యాస పరిస్థితులను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు తగిన సూచనలు చేశారు.

News September 3, 2025

WGL: గంజాయి ముఠా అరెస్ట్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్స్ కంట్రోల్ టీం భారీ ఆపరేషన్‌లో భాగంగా 763 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.3.81 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖానాపూర్ మండలం, చిలుకలగుట్ట ఏరియాలో నిందితులు తెల్లటి బస్తాలను దింపుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.