News April 11, 2024

వరంగల్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు

image

వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ ఆధ్వర్యంలో నేడు ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములుతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 27, 2026

పుర ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్‌ సత్య శారద

image

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. నర్సంపేటలోని 30 వార్డులు, వర్ధన్నపేటలోని 12 వార్డులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

News January 26, 2026

మూడు రోజుల అనంతరం ఓపెన్ కానున్న వరంగల్ మార్కెట్

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పున:ప్రారంభం కానుంది. శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News January 26, 2026

అబార్షన్ల మాఫియాపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చెప్పండి: కలెక్టర్

image

బాలికల పట్ల వివక్ష తగదని, జిల్లాలో బాలికల నిష్పత్తి తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అందుకు సంబంధించిన ప్రచారపత్రాలను పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లోని హెల్త్ స్టాల్ వద్ద ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయడం నేరమని, అలాంటి వారి గురించి 63000 30940 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.