News August 30, 2025
వరంగల్: భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు శనివారం ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.
Similar News
News August 30, 2025
NZB: 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం

కురిసిన వర్షాలకు నిజామాబాదు జిల్లాలోని 21 మండలాల్లో 41,098 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసిందని అధికారులు తెలిపారు. ఇందులో 14,663 మంది రైతులకు సంబంధించి 28,131 ఎకరాల వరి, 5,418 మందికి చెందిన 12,054 ఎకరాల సొయా, 382 మందికి చెందిన 565 ఎకరాల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చామని పేర్కొన్నారు.
News August 30, 2025
ఆనందపురంలో ITBP కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆనందపురం (M) పందలపాకలోని IPBP హెడ్‌క్వార్టర్స్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు (D) డోన్(M)నికి చెందిన జీ.నరేంద్ర నాథ్ (32) 15 నెలలుగా ఆనందపురం 56వ బెటాలియన్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం హెడ్‌క్వార్టర్స్‌లోని మామిడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయినట్లు బెటాలియన్ ఇన్‌ఛార్జ్ సూరజ్ ప్రకాష్ జోషి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News August 30, 2025
భద్రకాళి ఆలయానికి నూతన ఈవో

వరంగల్ భద్రకాళి ఆలయానికి నెల తిరగకముందే నూతన ఈవోను రాష్ట్ర దేవాదాయ శాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవో సునీతను తప్పించి, సీనియర్ అధికారిణి సంధ్యారాణిని ఈవోగా నియమించింది. గతంలో ఐదున్నర ఏళ్ల పాటు పనిచేసిన సునీత నెల రోజులు తిరగకముందే ఆమె స్థానాన్ని మార్చడంపై రాజకీయ నేతల హస్తం ఉందని మాట్లాడుకుంటున్నారు. సునీతపై రాష్ట్ర ఎండోమెంట్ అధికారులకు సైతం కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.