News November 22, 2025

వరంగల్ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

మార్గశిర మాసం సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు. దేవస్థానం పరిసరాలు భక్తి శ్రద్ధలతో సందడిగా మారాయి.

Similar News

News November 22, 2025

HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

image

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్‌లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్‌మార్క్‌గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.

News November 22, 2025

అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఈనెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఈనెల 19న చనిపోయినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తనది అచ్చంపేట ప్రాంతమని చెప్పినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో ఉందని ఇతనిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.

News November 22, 2025

GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

image

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.