News October 8, 2025

వరంగల్: భారీగా తగ్గిన పలికాయ ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు నేడు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, సూక పల్లికాయకు కూడా నిన్నటి లాగే రూ.6,610 ధర వచ్చింది. పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,710 ధర పలకగా.. ఈరోజు భారీగా పడిపోయి రూ.4100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 8, 2025

సిరిసిల్ల: సన్నవడ్ల BONUSపై ఆశలు గల్లంతేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లకు బోనస్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయని పలువురు రైతన్నలు పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతన్నలు సన్న వడ్లను సాగు చేశారు. గత సీజన్లో ప్రభుత్వం 10 వేల క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు బోనస్ రాకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్నాలను సాగు చేశారు.

News October 8, 2025

హుజూరాబాద్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

image

హుజూరాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గ్రామ శివారులోని కాకతీయ కాలువలో బుధవారం ఉదయం గుర్తుతెలియని మృత దేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, రెండు రోజుల క్రితం కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. శవం ఉబ్బిపోవడంతో గుర్తింపు కష్టతరమైందని పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణం, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 8, 2025

పిల్లల ఫొటోలు తీస్తున్నారా? ఇలా చేయండి!

image

చాలామంది తమ పిల్లల బాల్యాన్ని, మధుర జ్ఞాపకాలను కెమెరాతో బంధించి కొద్దిరోజుల్లోనే డిలీట్ చేయడం చూస్తుంటాం. ఇంతదానికి ఫొటోలు తీయడం ఎందుకు? అలా చేయకుండా వారి పేరిట ఓ మెయిల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలను mailలో స్టోర్ చేసి యుక్త వయసు వచ్చాక వారికిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదూ. మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మెయిల్ క్రియేట్ చేసేయండి. SHARE IT