News March 20, 2025
వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,700 పలికింది. 341 రకం మిర్చికి నిన్న రూ.12,800 ధర రాగా ఈరోజు రూ. 13,000 అయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా బుధవారం రూ.16వేలు ధర పలకగా ఈరోజు రూ.15,500కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News November 9, 2025
పర్వతగిరి: కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కలెక్టర్ సూచనలు..!

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ సత్య శారద సూచనలు చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని 100% ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేసుకుంటేనే మిల్లువారు ఎలాంటి కటింగ్ లేకుండా 41kgకి అంగీకరిస్తారన్నారు. మిల్లులో అన్ లోడింగ్ ఐన మరుక్షణమే OPMS పూర్తి చేసి, 24గంటల్లో రైతుఖాతాలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని నేల మీద కాకుండా కవర్ల మీదే పోయాలని, ప్రతి కుప్ప చుట్టూ చిన్న కందకం చేయాన్నారు.
News November 9, 2025
పర్వతగిరి: Way2News కథనానికి స్పందన

Way2News కథనానికి స్పందన లభించింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకంలో భాగంగా పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో నిర్మించిన మూడు వేల మెట్రిక్ టన్నుల గోదామును వినియోగించాలని కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. పథకంలో భాగంగా నిర్మించిన గోదాములు నిరుపయోగంగా ఉంటున్నాయని గతంలో Way2News ప్రచురించిన కథనానికి స్పందిస్తూ.. ప్రస్తుత అవసరాలకు గోదామును వినియోగించాలని కలెక్టర్ సూచించారు.
News November 8, 2025
పంట నష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలి: వరంగల్ కలెక్టర్

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఇటీవల దెబ్బతిన్న పంటలను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల నష్టాన్ని పూర్తిగా పారదర్శకంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, DM సివిల్ సప్లైస్ సంధ్యారాణి తదితరులు ఉన్నారు.


