News November 24, 2025
వరంగల్: భారీగా పతనమవుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో మొక్కజొన్న ధర రూ.1,970కి పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే, మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.14,500 ధర రాగా.. దీపిక మిర్చికి సైతం రూ.14,500 ధర వచ్చింది.
Similar News
News November 24, 2025
గొల్లపల్లి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది. సోమవారం జరిగిన గృహప్రవేశం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ హాజరయ్యారు. పేదలకు సొంతింటి కల సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
News November 24, 2025
జగిత్యాల: నూతన డీఈ టెక్నికల్ అంజయ్య బాధ్యతలు

NPDCL జగిత్యాల విద్యుత్ శాఖలో ఎన్.అంజయ్య సోమవారం డీఈ (టెక్నికల్)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన అనంతరం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సుదర్శనంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఆయనతో శాఖ వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అంజయ్య నియామకంతో జిల్లాలోని విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, సహచర అభ్యర్థులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.


