News January 17, 2026
వరంగల్: భారీ వర్షాల నష్టంపై కేంద్రానికి నివేదిక: గయా ప్రసాద్

మొంథా తుఫాన్ ప్రభావంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తి, మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ గయా ప్రసాద్ తెలిపారు.అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో రెండు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News February 12, 2026
ఓపిక తగ్గిపోతోందా?

వాతావరణ మార్పులు, వేళకి తినకపోవడం, ఇంటా బయటా పనంటూ ఉరుకులు పరుగుల వల్ల చాలామంది మహిళలు తరచూ నీరసపడిపోతూ ఉంటారు. తగినంత విశ్రాంతి లేకపోతే శరీరం మాత్రం కోలుకోదు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి. రోజూ మీ ఆహారంలో పప్పుధాన్యాలు, గింజలను తప్పనిసరి చేసుకోండి. తేలికపాటి వ్యాయామాల్నీ దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. పనంతా పూర్తయ్యాక తప్పదు కాబట్టి నిద్ర అన్నట్లుగా కాక ఒక సమయాన్ని నిర్దేశించుకోండి.
News February 12, 2026
VJA: ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు 13వ తేదీ నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించే కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు మహోత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పారు.
News February 12, 2026
NZB: నాలుగు కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్: సీపీ

నిజమాబాద్‌లో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. ఈ మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు సీపీ సాయి చైతన్య గురువారం తెలిపారు. మొత్తం నాలుగు కౌంటింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్(బాలుర, నిజామాబాద్), విజయ మేరీ హైస్కూల్(బోధన్), ప్రభుత్వ డిగ్రీ కళాశాల(పిప్రి, ఆర్మూర్), ప్రభుత్వ జూనియర్ కళాశాల(భీమ్‌గల్)లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వివరించారు.


