News July 19, 2024

వరంగల్: మక్కల ధరలకు బ్రేక్!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తున్న మొక్కజొన్న ధరలకు ఈరోజు బ్రేక్ పడింది. వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన మక్కల ధర ఈరోజు తగ్గింది. గురువారం రూ.2,780 పలికిన ధర.. ఈరోజు రూ.2,750 కి చేరింది. నిన్నటికి, నేటికీ స్వల్ప తేడా ఉన్నప్పటికీ ధరలు భారీగా పలుకుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News October 2, 2024

డోర్నకల్: ‘తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఉద్యోగం సాధించాడు’

image

డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వెగ్గళం విజయ్ డీఎస్సీలో జిల్లా స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనపరిచాడు. అతని తండ్రి ప్రభాకర శాస్త్రి ఎగ్జామ్‌కి 3 రోజులకి ముందు మరణించాడు. ఆ మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. SGT ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని, తన 10 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని, తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని విజయ్ అన్నారు.

News October 2, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలు బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.కె హమిద్ వరంగల్ వి.ఆర్ నుంచి బచ్చన్నపేటకు, కె.సతీశ్ బచ్చన్నపేట నుంచి ఐటీ వరంగల్‌కు, బి.చందర్ వరంగల్ మిల్స్ కాలనీ నుంచి వర్ధన్నపేటకు, ఏ.ప్రవీణ్ కుమార్ వర్ధన్నపేట నుంచి కేయూ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 2, 2024

వరంగల్: డీజే వినియోగం నిషేధం: పోలీస్ కమిషనర్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజేలనుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్స్, బాణాసంచా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.