News September 13, 2025
వరంగల్: మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వపై విశ్వసనీయ సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, అమ్మకందారులు లేదా తరలింపులో ఉపయోగించే వాహనాలపై ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 71111 ద్వారా అందించవచ్చు అన్నారు.
Similar News
News September 13, 2025
KNR: ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
News September 13, 2025
SRR కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం SEP 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, దోస్త్ కోఆర్డినేటర్ డా.ఆర్.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సులకు 82 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్ల, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు.
News September 13, 2025
ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: హెల్త్ డైరెక్టర్

యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడారు. వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఆయన అన్నారు.