News October 4, 2025
వరంగల్: మద్యం టెండర్లకు మందకొడిగా దరఖాస్తులు

ఉమ్మడి WGL జిల్లాలో 294 మద్యం దుకాణాలకు గతనెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడంలేదు. శుక్రవారం వరకు కేవలం 8 దరఖాస్తులే రావడం గమనార్హం. WGL జిల్లాలో 57 షాపులకుగాను 3, HNK 67 షాపులకు 1, JNGలో 50 షాపులకు 2, MHBDలో 61 షాపులకు 2, MLG, BPL జిల్లాలకు 59 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.
Similar News
News October 4, 2025
అభివృద్ధికి అడ్డుపడుతూ వైసీపీ సైకోయిజం: గంటా

AP: రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ YCP సైకోయిజాన్ని ప్రదర్శిస్తోందని TDP MLA గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘ప్రభుత్వం 15 నెలల్లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇది జీర్ణించుకోలేక ప్రాజెక్టులు అడ్డుకునేందుకు YCP కుట్రలు చేస్తోంది. విశాఖలో TCSకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని హైకోర్టుకెళ్లి మొట్టికాయలు తిన్నారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్‌ను ఆపాలని చూస్తున్నారు’ అని ఓ ప్రకటనలో విమర్శించారు.
News October 4, 2025
అక్టోబర్ 4: చరిత్రలో ఈరోజు

1911: సినీ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
1957: మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ను ప్రయోగించిన సోవియట్ యూనియన్
1977: నటి సంఘవి జననం
1997: క్రికెటర్ రిషభ్ పంత్ జననం(ఫొటోలో)
1947: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
2015: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరణం
* అంతర్జాతీయ జంతు దినోత్సవం
News October 4, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.